వైరల్: కొత్త లుక్ లో అదరగొట్టిన చరణ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ భారీ సినిమా “గేమ్ ఛేంజర్” ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా తర్వాత చరణ్ తన కెరీర్ 16వ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరక్కిస్తుండగా ఈ సినిమా కోసం చరణ్ సాలిడ్ లుక్ ని కూడా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాడు.

అయితే కొన్ని రోజులు కితం చరణ్ పై వచ్చిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా చరణ్ కొత్త లుక్ పై మరిన్ని లీక్స్ వచ్చాయి. మరి వీటిలో మళ్లీ రంగస్థలం తరహాలో లుక్ కి బల్క్ బాడీ తోడైతే ఎలా ఉంటుందో అంత మ్యాచో లుక్ లో అదిరిపోయాడని చెప్పాలి. దీనితో తన లుక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అలాగే ఇవి చూసిన చరణ్ అండ్ మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు.

Exit mobile version