SSMB29 మూవీపై రామ్ చరణ్ జోస్యం

SSMB29 మూవీపై రామ్ చరణ్ జోస్యం

Published on Jan 2, 2025 9:57 PM IST

యావత్ టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఎట్టకేలకు మొదలైంది. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.

అయితే, ఈ సినిమా ఎప్పటిలోగా రిలీజ్ కానుందనే విషయంపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా జోస్యం చెప్పారు. చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్‌ను నేడు నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్‌లో ఎస్ఎస్.రాజమౌళి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా జక్కన్నతో తనకున్న ఎక్స్‌పీరియెన్స్‌ను రామ్ చరణ్ అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఇదే క్రమంలో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 మూవీ ఏడాది లేదా ఏడాదిన్నరలోగా వచ్చేస్తుందని తనకు నమ్మకం ఉందని చరణ్ తెలిపారు. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా SSMB29 మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు