టాలీవుడ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా.. లేడీ యాంకర్ దీపిక పిల్లి హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను నితిన్-భరత్ డైరెక్ట్ చేస్తున్నారు. పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్‌కు రెడీ అయ్యింది.
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ టైటిల్‌ను ఇప్పుడు ఈ సినిమాకు పెట్టడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాకు తన సపోర్ట్ అందించాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ చిత్ర రిలీజ్ సందర్భంగా ఈ సినిమా తొలి టికెట్‌ను రామ్ చరణ్ కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాబాయ్ నటించిన తొలి సినిమా టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి అబ్బాయి సపోర్ట్ ఇస్తుండటంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తుండగా మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది.