ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమా ‘పెద్ది’ పై సాలిడ్ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇక పెద్ది సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ తో మరో భారీ సినిమా చరణ్ లైనప్ లో కూడా ఉంది.
ఇలా ఉన్న కొన్ని సినిమాలే అయినా చరణ్ లైనప్ పాన్ ఇండియా లెవెల్లో మంచి ఇంపాక్ట్ సెట్ చేసే లైనప్ తోనే ఉండడం విశేషం. అయితే వీటితో పాటుగా మరో సెన్సేషనల్ కలయిక ఇపుడు సాధ్యం కాబోతుంది అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అదే దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో అట. కొన్నాళ్ల కితమే వీరి కలయికపై టాక్ వినిపించింది కానీ ఇపుడు ఇడోయ్ దాదాపు నిజమే అని తెలుస్తుంది. దీనితో ఈ సెన్సేషనల్ కలయిక జరగబోతుంది అని అనుకోవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.