ప్రస్తుతం రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కించిన ఈ అవైటెడ్ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా బుకింగ్స్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న సమయంలో ఓ రోజు ముందు ఓపెన్ అయ్యాయి.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చరణ్, నిర్మాత దిల్ రాజు బాలయ్య టాక్ షోలో హాజరు కావడం జరిగింది. మరి ఇందులో దిల్ రాజు చరణ్ పై చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. గేమ్ ఛేంజర్ కోసం చరణ్ చాలా చేశాడని ఈ ఒక్క సినిమా కోసం అప్పుడు చేయాల్సిన ఓ సినిమా కూడా వదులుకున్నాడని తెలిపారు. అయితే గేమ్ ఛేంజర్ సమయంలో చరణ్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేయాల్సిన సినిమా అనౌన్స్ అయ్యి ఆగిపోయిన సంగతి తెలిసిందే. మరి బహుశా ఆ సినిమానే గేమ్ ఛేంజర్ కోసం వదులుకున్నాడని చెప్పాలి.