జపాన్లో చరణ్ క్రేజ్.. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కి డిమాండ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (Happy Birthday Ram Charan) నేడు కావున సినీ ప్రముఖులు సహా అభిమానులు నిన్న అర్ధ రాత్రి సమయం నుంచే తమ బెస్ట్ విషెస్ ని చెబుతూ వస్తున్నారు. మరి రామ్ చరణ్ కి ఒక్క పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా జపాన్ దేశంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే జపాన్ లో తన పుట్టినరోజు సందర్భంగా అక్కడ చాలా మంది అభిమానులు రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేసి ఆనందం వ్యక్తం చేసిన విజువల్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

అంతే కాకుండా చరణ్ లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ (Game Changer Release in Japan) ని కూడా అక్కడ రిలీజ్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తుండడం గమనార్హం. దీనితో ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అభిమానులు ఇవి చూసి తమ అభిమాన హీరో పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనితో రామ్ చరణ్ క్రేజ్ జపాన్లో ఏ రీతిలో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి గేమ్ ఛేంజర్ వారి కోరిక మేరకు జపాన్లో రిలీజ్ అవుతుందో లేదో అనేది చూడాలి.

Exit mobile version