గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సిడ్ రెస్పాన్స్ దక్కింది.
అయితే, ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు చూపిన ఇంట్రెస్ట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన అభినందనలు తెలిపాడు. ‘గేమ్ ఛేంజర్’ మూవీ తెరకెక్కించడంలో తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం కష్టపడిన అందిరికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రామ్ చరణ్ ప్రకటించాడు.
ఇలాంటి పవర్‌ఫుల్ కథను అందించిన శంకర్ సార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ చరణ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటించారు.