మేనకోడలితో చరణ్ ఆసక్తికర వీడియో

Published on Aug 4, 2020 11:36 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితం అవుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక ఇంట్లో రామ్ చరణ్ తనకు ఇష్టం వచ్చిన వ్యాపకాలలో మునిగిపోతున్నారు. వ్యాయామం, సినిమాలు చూడడం వంటివి చేస్తున్నారు. అలాగే భార్య ఉపాసన మరియు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.

కాగా రామ్ చరణ్ ఓ ఆహ్లాదకర వీడియో పంచుకున్నారు. తన మేనకోడలు నవిష్క తో ఆయన జాలీగా స్టెప్స్ వేశారు. శ్రీజ కూతురు నవిష్కకు టీవీ చూపిస్తూ డాన్స్ చేస్తున్న వీడియో ఆసక్తి రేపుతోంది. ఇక ఆ వీడియోలో చరణ్ లుక్ డిఫరెంట్ గా ఉంది. ఆయన జుట్టు, గడ్డం పెంచేశారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం ఆయన ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాదిలోనే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More