ఫోటో మూమెంట్: స్టాఫ్‌తో క్రిస్మస్ జరుపుకున్న చరణ్, ఉపాసన

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. చర్చీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇక క్రిస్మస్ పర్వదినాన్ని సెలబ్రిటీలు సైతం ఎంతో గ్రాండ్‌గా జరుపుకున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కూడా క్రిస్మస్ పండుగను సమ్‌థింగ్ స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ స్టాఫ్‌తో వారు ఈసారి క్రిస్మస్ వేడుకను చేసుకున్నారు. తమకు ఎప్పుడు ఏం కావాలో దగ్గరుండి చూసుకునే స్టాఫ్‌కు ఇలా క్రిస్మస్ ట్రీట్ ఇవ్వడంతో వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.

ఇక దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ స్టా్ఫ్‌ను కూడా తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న చరణ్-ఉపాసనల పై మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version