రామ్ చరణ్‌ను కొత్తగా చూస్తారు – శంకర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌‌గా నటిస్తోంది. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధ‌ం చేస్తుండగా.. ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ సాంగ్‌ను సెయింట్ మార్టిన్స్ కాలేజ్‌లో స్టూడెంట్స్ స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘గేమ్ చేంజర్’ ప్రమోషన్స్ ఈ కాలేజ్ నుంచే స్టార్ట్ చేశాం. జెంటిల్‌మేన్ నుంచి శంక‌ర్‌గారు డైరెక్ట్ చేసిన అన్నీ సినిమాలు నాకు ఇష్ట‌మే. ప్ర‌తీ సాంగ్‌ను ఆయ‌న ఎంతో స్పెష‌ల్‌గా తెర‌కెక్కిస్తుంటారు. ‘గేమ్ చేంజర్’లోనూ ఐదు పాట‌ల‌ను ఐదు ర‌కాలుగా విజువ‌లైజేష‌న్ చేశారు. మ‌రో మూడు అద్భుత‌మైన పాట‌లు రానున్నాయి. ట్రిపులార్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేసిన ‘గేమ్ చేంజర్’ను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ.. ‘నేను డైరెక్ట్ చేసిన ప్ర‌తీ సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రించారు. అలాంటి ప్రేక్ష‌కుల కోసం ఓ స్ట్ర‌యిట్ మూవీ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ రూపంలో అది నేర‌వేరుతుంది. దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ప‌క్కా తెలుగు సినిమాలా ప్ర‌తి విష‌యంలో కేర్ తీసుకుని ఎంతో జాగ్ర‌త్త‌గా దీన్ని తెర‌కెక్కించాను. సాంగ్స్ విష‌యానికి వ‌స్తే నేను హీరో ఇంట్ర‌ొడ‌క్ష‌న్ సాంగ్ ఏ సినిమాలోనూ చేయ‌లేదు. కానీ తొలిసారి ‘గేమ్ చేంజర్’లో అలాంటి హీరో ఇంట్రో సాంగ్ చేశాను. తెలుగు సంస్కృతిని చూపించ‌టానికి 1000 మంది జాన‌ప‌ద క‌ళ‌కారుల‌తో పాట‌ను చిత్రీక‌రించాం. రెండు రోజుల్లో అన్నీ ట్యూన్స్‌ని రికార్డ్ చేసి ఈ పాట‌ను త‌మ‌న్ చేయ‌టం విశేషం. రామ్ చ‌ర‌ణ్‌ని స‌రికొత్త‌గా డిఫ‌రెంట్ డైమ‌న్ష‌న్స్‌లో చూడొచ్చు. ఈ సాంగ్‌లో ఒక నిమిషం పాటు వ‌చ్చే బీజీఎంను ఆయ‌న సింగిల్ టేక్ డాన్స్‌తో పూర్తి చేశారు.’ అని అన్నారు.

ఎస్‌.జె.సూర్య మాట్లాడుతూ.. ‘‘గేమ్ చేంజర్’ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాను. చ‌ర‌ణ్‌తో శంక‌ర్‌ డైరెక్ష‌న్‌లో దిల్‌ రాజు ప్రొడ‌క్ష‌న్‌లో యాక్ట్ చేయ‌టం అనేది గొప్ప బ‌హుమ‌తిగా భావిస్తున్నాను. త‌మ‌న్‌ మ్యూజిక్‌లో ఔట్‌పుట్ అదిరింది. ఓ ఫుల్ మీల్స్‌ లాంటి సినిమా. మూవీ చాలా బాగా వ‌చ్చింది. సినిమాలో డెఫ‌నెట్‌గా ఫెంటాస్టిక్ డ్రామా, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ అన్నీ ఉంటాయి.’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ.. ‘ఇర‌వై ఏళ్ల క్రితం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బాయ్స్ అనే సినిమా చేశాను. అప్పుడు నా ద‌గ్గ‌రుండే చిన్న కీ బోర్డ్‌తో ఆయ‌న‌కొక ట్యూన్ వినిపించాను. త‌ర్వాత ఆయ‌న ప్రొడ‌క్ష‌న్‌లో తెర‌కెక్కిన వైశాలి సినిమాతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మారాను. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘గేమ్ చేంజర్’ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాను. జ‌ర‌గండి సాంగ్ త‌ర్వాత రా మచ్చా మ‌చ్చా.. సాంగ్‌ను అంద‌రికీ అందిస్తున్నాం.’ అని అన్నారు.

Exit mobile version