Devara: ‘దేవర’కు ఆల్ ది బెస్ట్ చెప్పిన ‘గేమ్ ఛేంజర్’

Devara: ‘దేవర’కు ఆల్ ది బెస్ట్ చెప్పిన ‘గేమ్ ఛేంజర్’

Published on Sep 26, 2024 4:20 PM IST

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘దేవర’ మూవీ మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న ఈ మాస్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పీక్స్‌కి చేరాయి. ఈ చిత్రం తొలిరోజే పలు కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు, సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని పలువురు స్టార్స్ ‘దేవర’కు ఆల్ ది బెస్ట్ చెబుతూ నెట్టింట పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన విషెస్ చెప్పుకొచ్చాడు. ‘నా సోదరుడు తారక్ అండ్ దేవర టీమ్‌కి ఆల్ ది బెస్ట్’ అని చరణ్ ట్వీట్ చేశాడు.

దీంతో భీమ్‌కి రామ్ విషెస్ చెప్పాడని ఇద్దరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ నుంచి రెండో సింగిల్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘దేవర’ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు