ఫోటో మూమెట్: గేమ్ ఛేంజ్ చేయనున్న ప్రొడ్యూసర్‌కి రామ్ చరణ్ విషెస్

ఫోటో మూమెట్: గేమ్ ఛేంజ్ చేయనున్న ప్రొడ్యూసర్‌కి రామ్ చరణ్ విషెస్

Published on Dec 19, 2024 2:12 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు.

తాజాగా నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సందర్భంగా తన నిర్మాతను స్వయంగా కలుసుకుని ఆయనకు విషెస్ అందజేశారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తాను ఎల్లప్పుడు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

వీరిద్దరు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ రికార్డులను ఎలా ఛేంజ్ చేస్తుందో చూడాలి అంటున్నారు అభిమానులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు