‘చరణ్’ 256 అడుగుల భారీ కటౌట్.. అదిరింది !

దర్శకుడు శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ పొలిటికల్ డ్రామా పై మెగా ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల భారీ కటౌట్ రెడీ చేశారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్‌ పెట్టడం ఇదే తొలిసారి అని.. ఇది తమకెంతో ప్రత్యేకమని మెగా ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు వారు చెప్పుకొచ్చారు.

కాగా ఈ భారీ కటౌట్ పెట్టడానికి దాదాపు వారం రోజులు శ్రమించారట. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ నిర్మాణంలో భాగమైందట. మొత్తానికి చరణ్ అభిమానులు సరికొత్తగా ఆలోచించారు. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. అన్నట్టు గేమ్ ఛేంజర్ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను అనిల్ తడాని యొక్క AA ఫిల్మ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదల కానుంది.

Exit mobile version