ఈ డేట్ న గేమ్ ఛేంజ్ చేసేందుకు రాబోతున్న చరణ్!?

ఈ డేట్ న గేమ్ ఛేంజ్ చేసేందుకు రాబోతున్న చరణ్!?

Published on Jul 22, 2024 12:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రాబోతోందా అని అభిమానులు చాన్నాళ్ల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫైనల్ గా నిర్మాణ దిల్ రాజు ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ రిలీజ్ చేస్తున్నట్టుగా ధనుష్ “రాయన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పేసారు.

దీనితో ఒక ఊరట అయితే అభిమానులకి లభించింది. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా రివీల్ చేయలేదు. క్రిస్మస్ రిలీజ్ కదా అని డిసెంబర్ 25 కి రిలీజ్ చేసే అవకాశం అసలు లేదు. మరి ఏ డేట్ లో సినిమా వస్తుంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ భారీ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20న థియేటర్స్ లో పడనున్నట్టుగా తెలుస్తుంది. ఆ డేట్ లో వస్తే పర్ఫెక్ట్ గా క్రిస్మస్ కలిసొస్తుంది అని టాక్. మరి ఈ డేట్ సంబంధించి అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు