అదరగొడుతున్న గ్లోబల్ స్టార్ ‘రా మచ్చా మచ్చా’ రెస్పాన్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం మెగా ఫాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకి ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్స్ బయటకి వస్తుండగా సినిమా నుంచి మాస్ సింగిల్ రా మచ్చా మచ్చా ఇప్పుడు అదరగొడుతుంది అని చెప్పాలి.

ముఖ్యంగా రామ్ చరణ్ గ్రేస్ కానీ థమన్ మాస్ బీట్స్ తో సాంగ్ ఫ్యాన్స్ సహా మ్యూజిక్ లవర్స్ కి కూడా బాగానే ఎక్కేసినట్టుగా కనిపిస్తుంది. అలా యూట్యూబ్ లో ఈ సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. 10 మిలియన్ కి పైగా వ్యూస్ ని ఒక్క తెలుగు వెర్షన్ లోనే రాబట్టి మన టాలీవుడ్ రీసెంట్ ఫస్ట్ సింగిల్స్ లో అదరగొడుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ రేస్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కి తీసుకురాబోతున్నారు.

Exit mobile version