తొలిసారి ఆ జోనర్ టచ్ చేస్తున్న RGV

తొలిసారి ఆ జోనర్ టచ్ చేస్తున్న RGV

Published on Apr 9, 2025 11:00 PM IST

వివాదాస్పద దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ గతకొంత కాలంగా సరైన సినిమాలను తెరకెక్కించడం లేదని ఆయన అభిమానులు భావిస్తున్నారు. కాంట్రోవర్సీలకే ఆయన ప్రాధాన్యత ఇవ్వడంతో వర్మ తన ట్రాక్ పూర్తిగా తప్పారని వారు అంటున్నారు. అయితే, గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనం చూశాం.

క్రైమ్, హార్రర్ లాంటి జోనర్‌లలో వర్మ తన సత్తా చాటారు. అయితే, ఈసారి హార్రర్‌కు కామెడీని జోడించి ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు వర్మ తెలిపారు. తన నెక్స్ట్ మూవీ హార్రర్ కామెడీగా రానుందని.. సత్య, కౌన్, శూల్ వంటి సినిమాల తర్వాత విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌తో మరోసారి తాను సినిమా చేయబోతున్నట్లు వర్మ అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమా కథను కూడా ఆయన వెల్లడించారు. ప్రజలకు భయం వేస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు.. కానీ, అదే పోలీసులకు దెయ్యం కారణంగా భయం వేస్తే.. వారు ఎక్కడికి వెళ్తారు.. అనేది ఈ సినిమా కథగా రానుందట.

‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే టైటిల్‌తో ఈ సినిమాను రూపొందించనున్నాడు వర్మ. ఈ సినిమాలో అదిరిపోయే వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఉంటాయని వర్మ తెలిపారు. మొత్తానిక ఓ ఇలాంటి జోనర్‌ను RGV తొలిసారి టచ్ చేస్తుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై కాస్త ఆసక్తి మొదలైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు