సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నటుడిగా మారబోతున్నారు అని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. వరుసగా పరాజయాలు ఎదురవుతున్నా, కొత్త సినిమాను ఎలా మార్కెట్ చేసుకోవాలో, క్రేజ్ రాబట్టాలో తెలిసిన వర్మ నటుడిగా కొత్త అవతారం ఎత్తారు అంటూ అప్పుడే కామెంట్స్ ప్రారంభమయ్యాయి.
తాజాగా ప్రకటించిన ‘స్పాట్’ సినిమాలో వర్మ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. వర్మ నటన ఎలా ఉంటుందో..? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. రక్తచరిత్ర సినిమాతో వర్మ గాయకుడిగా మారారు. అదే సినిమాతో వాయిస్ ఓవర్ ఇవ్వటం ప్రారంభించారు. ఆ తర్వాత అదో వ్యసనంలా మారింది. ప్రతి సినిమాలో వర్మ వాయిస్ వినిపిస్తూ ఉంది. ఇక నటుడిగా కూడా విశ్వరూపం చూపిస్తారేమో..? వెయిట్ & సి


