మరో భయానక సినిమాతో రామ్ గోపాల్ వర్మ.!

Published on Jul 4, 2020 3:00 am IST


ఒక్క మన టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం మన ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ లో సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సేపరేటు అని చెప్పాలి. ఏమనుకున్నా సరే తాను చెప్పాలియా అనుకున్నది చెప్పేస్తారు. ఇలాంటి కరోనా కష్ట కాలంలో కూడా సినిమాలు తీయడం కూడా ఒక్క వర్మకే చెల్లిన అంశం అని చెప్పాలి. ఈ మధ్య కాలంలోనే పలు బోల్డ్ మరియు అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను తనకంటూ ప్రత్యేక ప్రపంచం సృష్టించుకొని మరీ విడుదల చేసారు.

తాను దర్శకత్వం వహించిన “క్లైమాక్స్” మరియు “నేకెడ్” చిత్రాలు ఆల్రెడీ విడుదల కూడా అయ్యిపోయాయి. అలాగే వీటితో పాటు తెరకెక్కించిన “కరోనా వైరస్” చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా ఇది లైన్ లో ఉండగానే మరో సినిమా కూడా విడుదల కు రానుంది అని వర్మ ప్రకటించాడు. తాను ఎంతో బాగా హ్యాండిల్ చేయగలిగే హార్రర్ కేటగిరీను చాలా ఏళ్లకు ఎన్నుకున్నారు.

“12 ఓ క్లాక్” పేరిట తెరకెక్కించిన ఈ కొత్త చిత్రం నుంచి ట్రైలర్ కూడా విడుదల చేసారు. దీనికి కూడా వర్మ అన్ని సినిమాల్లానే మొదట్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తాయో మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే ఈ ట్రైలర్ లో ఎం ఎం కీరవాణి అందించిన మ్యూజిక్ ఎఫెక్ట్స్ ఈ ట్రైలర్ కట్ కు ప్రధాన బలంగా నిలిచాయి అని చెప్పొచ్చు. మరి ఈ ఫుల్ లెంగ్త్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More