చరణ్ పొటెన్షియల్ ని మళ్ళీ సరిగ్గా వాడింది బుచ్చిబాబే – ఆర్జీవీ

చరణ్ పొటెన్షియల్ ని మళ్ళీ సరిగ్గా వాడింది బుచ్చిబాబే – ఆర్జీవీ

Published on Apr 8, 2025 9:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో అదరగొడుతున్న లేటెస్ట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కించిన చిత్రం “పెద్ది” అనే చెప్పాలి. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ కి సాలిడ్ రెస్పాన్స్ రాగా దీనిపై సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందన ఇపుడు వైరల్ గా మారింది.

పెద్ది గ్లింప్స్ చూసాక ఇది అసలైన గేమ్ ఛేంజర్ లా అనిపించింది అని చరణ్ గ్లోబల్ కాదు యూనివర్సల్ లెవెల్లో కనిపిస్తున్నాడు అంటూ పొగిడేశారు. ఇక దీనితో పాటుగా రాజమౌళి తర్వాత రామ్ చరణ్ లోని పొటెన్షియల్ ని బుచ్చిబాబు నువ్వు అర్ధం చేసుకున్నంతగా ఎవరూ అర్ధం చేసుకోలేదు అనిపించింది. ఖచ్చితంగా ఈ సినిమా ట్రిపుల్ సిక్సర్ అవుతుంది. అంటూ ఆర్జీవీ చేసిన పోస్ట్ ఇపుడు రామ్ చరణ్ అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని రేకెత్తించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు