త్వరలో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయనున్న రామ్ పోతినేని!

త్వరలో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయనున్న రామ్ పోతినేని!

Published on Sep 5, 2024 6:03 PM IST

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రామ్ పోతినేని మరియు పూరీ జగన్నాథ్ ల మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మా ర్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సినిమా ఓపెనింగ్స్ ను కూడా రాబట్టడంలో విఫలం అయ్యింది. రామ్ ఫ్యాన్స్ ఈ విషయం పట్ల కాస్త అసహనంగా ఉన్నారు. రామ్ నటించబోయే తదుపరి చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ నటించనున్నట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. ఈ చిత్రంతో పాటుగా మరొక చిత్రానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. వెకేషన్ పూర్తి చేసుకొని ఇటీవల హైదరాబాద్ వచ్చిన రామ్, కొంచెం టైమ్ తీసుకొని సినిమా స్టార్ట్ చేయనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు