“గాలి సంపత్” కోసం వస్తున్న ఇస్మార్ట్ శంకర్.!

Published on Mar 6, 2021 10:09 pm IST


ప్రస్తుత జెనరేషన్ లో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకడు. ఎలాంటి రోల్ లో అయినా చక్కగా కుదిరే ఈ యువ హీరో లేటెస్ట్ గా చేస్తున్న చిత్రం “గాలి సంపత్”. టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకడైన అనీల్ రావిపూడి సమర్పణలో అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కూడా వచ్చే వారం విడుదలకు రెడీగా ఉంది.

అయితే ఇప్పుడు హైదరాబాద్ లో జరగనున్న ఈ చిత్రం తాలూకా ప్రీ రిలీజ్ వేడుకకు గాను ఇస్మార్ట్ శంకర్ తో ఇప్పుడు మాస్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ గెస్ట్ గా వచ్చి తన వంతు సినిమాకు హెల్ప్ చేయనున్నాడు. మరి ఈ సందర్భంగా అనీల్ రావిపూడి రామ్ కు తన ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక ఈ చిత్రంలో లవ్లీ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా నట కిరీతో రాజేంద్ర ప్రసాద్ ఒక అద్భుతమైన రోల్ లో కనిపించనున్నారు. మరి ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ మరియు ఇమేజ్ స్పార్క్ నిర్మాణం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :