డీసెంట్ హోల్డ్ లో “రెడ్” వసూళ్లు..రెండో రోజు లెక్కలు ఇవే.!

డీసెంట్ హోల్డ్ లో “రెడ్” వసూళ్లు..రెండో రోజు లెక్కలు ఇవే.!

Published on Jan 16, 2021 2:01 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “రెడ్” ఈ సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం మొట్ట ఎందటి రోజు కూడా సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకున్న సంగతి కూడా తెలిసిందే. ముఖ్యంగా ఈ సమయంలో మంచి ఓపెనింగ్స్ ను అందుకోవడం విశేషం. అలాగే రెండో రోజు కూడా ఈ చిత్రం డీసెంట్ గానే నిలిచింది.మరి ఈ చిత్రానికి రెండో రోజు వసూళ్ల విషయానికి వస్తే మొత్తం 4.17 కోట్లు షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఈ రెండు రోజులు వసూళ్ల విషయానికి వస్తే పీఆర్ లెక్కలు ఈ విధంగా చెబుతున్నాయి.

ఏరియాల వారీగా చూస్తే

నైజాం: 1.47 కోట్లు
సీడెడ్: 63 లక్షలు
ఉత్తరాంధ్రా: 36 లక్షలు
తూర్పు గోదావరి: 45 లక్షలు (21 లక్షలు హైర్స్)
పశ్చిమ గోదావరి: 58 లక్షలు (42 లక్షలు హైర్స్)
గుంటూరు: రూ .21 లక్షలు
కృష్ణ: 25 లక్షలు
నెల్లూరు: 22 లక్షలు

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు – 4.17 కోట్లు (రూ. 63 లక్షలు హైర్స్)

ఇక ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా మణిశర్మ సాలిడ్ సంగీతం అందించారు. అలాగే స్రవంతి రవికిశోర్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు