రామ్ “రెడ్” థియేట్రికల్ రిలీజ్ ను ప్లాన్ చేసేశారా?

Published on Sep 16, 2020 11:10 pm IST


టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో సాలిడ్ కం బ్యాక్ హిట్ అందుకోవడమే కాకుండా మాస్ లో కూడా మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు. దీనితో ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మొదలు పెట్టిన మరో మాస్ ఫ్లిక్ “రెడ్”. ఓ తమిళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమా పోస్టర్స్ కానీ పాటలకు కానీ మంచి హైప్ వచ్చింది. అలా మంచి టైం చూసి విడుదల చేద్దామనుకున్న టైం లో కరోనా మూలాన ఆగిపోవాల్సి వచ్చింది.

దీనితో ఈ గ్యాప్ లో ఓటిటి ఆఫర్స్ కూడా ఈ చిత్రానికి గట్టిగానే వచ్చాయి కానీ రామ్ కానీ నిర్మాతలు కానీ అందుకు సుముఖంగా లేరని తెలిపారు. గత కొన్ని రోజుల కితమే రామ్ కూడా రెడ్ చిత్రాన్ని ఓటిటి లో విడుదల చేయబోమని తెలిపాడు. దీనితో ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ అవ్వడం ఖరారు అయ్యింది.

అలా ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే థియేటర్స్ కానీ తెరిస్తే క్రిస్మస్ సీజన్లో ఉంచాలని దర్శకుడు కిషోర్ తిరుమల మరియు నిర్మాత స్రవంతి రవికిశోర్ లు ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా మాళవిక శర్మ, నివేతా పెత్తురాజ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More