రామ్ మొదటిసారి ఈ ప్రయత్నం చేస్తున్నాడు

Published on Oct 20, 2020 10:52 pm IST


‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ చేస్తున్న కొత్త చిత్రం ‘రెడ్’. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో కూడ విడుదల చేయనున్నారు. అందుకే రామ్ తెలుగుతో పాటు మలయాళంలో కూడ తానే డబ్బింగ్ చెప్పుకోనున్నారట. మామూలుగా వేరే భాషలంటే హీరోలకు డబ్బింగ్ వేరొకరు చెబుతుంటారు. కానీ రామ్ ఈసారి ఒరిజినాలిటీ కోసం తానే మలయాళంలో డబ్బింగ్ చెబుతారట. ఒక రకంగా ఇది అభినందించదగిన ప్రయత్నమే.

లాక్ డౌన్ లేకుంటే ఈపాటికే సినిమా బయటకు రావాల్సింది. అలాగే థియేటర్లు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోనందున చిత్ర నిర్మాతలు ఓటీటీ విడుదలకు వెళ్ళాలని అనుకున్నారు. కానీ తమిళ్, మలయాళ వెర్షన్లకు సరైన డీల్ కుదరకపోవడం, రామ్ సైతం థియేట్రికల్ రిలీజ్ మీదే ఆసక్తిగా ఉండటంతోఉండటంతో కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే చిత్రం విడుదలకానుంది. ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. స్రవంతి మూవీస్ బ్యానర్ మీద స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More