గోపీచంద్ “రామబాణం” గ్లింప్స్ రిలీజ్

Published on Mar 30, 2023 6:35 pm IST

శ్రీరామ నవమి పండుగ సందర్భంగా, టాలీవుడ్ హీరో గోపీచంద్ రాబోయే యాక్షన్ డ్రామా, రామబాణం గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిన్న వీడియో రామబాణం యొక్క ప్రధాన ఇతివృత్తాన్ని హైలైట్ చేస్తుంది. ఆ రాముడికి లక్ష్మణుడు, హనుమంతుడు అని ఇద్దరుంటారూ, ఈ రాముడికి ఆ ఇద్దరు నేనే వాయిస్ ఓవర్‌లో గోపీచంద్ అందించిన కీలకమైన డైలాగ్ జగపతి బాబు పోషించిన తన సోదరుడితో తన బంధాన్ని వివరిస్తుంది.

రామబాణం యొక్క ప్రత్యేక గ్లింప్స్ అంతా పండుగ వైబ్‌తో గ్రాండ్‌గా మరియు కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఈ చిత్రం యాక్షన్ మరియు ఎమోషన్స్‌తో కూడుకున్నదిగా ఉంటుందని వీడియో కూడా సూచిస్తుంది. మిక్కీ జె మేయర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ సూపర్ గా ఉంది. రామబాణం చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్‌కి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :