‘రామబాణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్

గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రామబాణం. డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతిబాబు, కుష్బూ కీలక పాత్రలు చేసారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై భారీ స్థాయిలో నిర్మితం అయిన రామబాణం మూవీ మే 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మరోవైపు ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి హైప్ ఏర్పరిచాయి. కాగా ఈ రామబాణం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏప్రిల్ 30న హైదరాబాద్ ఫిలిం నగర్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్, హాల్ 2లో సాయంత్రం 6 గం. ల నుండి గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన రామబాణం మూవీ తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Exit mobile version