‘రామయ్య వస్తావయ్యా’ : దిల్ రాజు అప్పటి కామెంట్స్ వైరల్


గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 2013లో తెరకెక్కిన మూవీ రామయ్య వస్తావయ్యా. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించగా సమంత, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటించారు. అయితే అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అందుకుంది.

ఇక తాజాగా ఈ మూవీ గురించిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా కెమెరా మ్యాన్ చోట కె నాయుడు మాట్లాడుతూ, అప్పట్లో రామయ్య వస్తావయ్యా విషయమై నేను హరీష్ కి కొన్ని సలహాలిచ్చాను, కానీ అవి అతడు వినలేదు, అందుకే అతడి ఆలోచననే అనుసరించి తీసాము అని అన్నారు. అనంతరం దీనిపై స్పందించిన హరీష్ శంకర్ ఒకింత ఘాటుగా చోటా కె నాయుడుకి ప్రెస్ నోట్ ద్వారా రిప్లై ఇచ్చారు.

కాగా ఇప్పుడు వీరిద్దరి టాపిక్ ట్రెండ్ అవుతుండడంతో ఈ మూవీ విషయమై గతంలో నిర్మాత దిల్ రాజు చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తాము రామయ్య వస్తావయ్యా కోసం ముందుగా అనుకున్న కథ వేరని, అయితే అప్పట్లో ప్రభాస్ గారి రెబల్ రిలీజ్ కారణంగా తమ మూవీ కథ మార్చాల్సి వచ్చిందని, కాగా అది ఆడియన్స్ కి రీచ్ కాకపోవడంతో మూవీ ఫ్లాప్ అయిందని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఎన్టీఆర్ కెరీర్ లో అప్పటి ఈ ఫ్లాప్ మూవీ టాపిక్ ప్రస్తుతం ప్రచారం అవుతోంది.

Exit mobile version