రవి బసృర్ తో సరస్వతీపుత్ర.. ఆ భారీ సినిమా కోసమే..

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి సెన్సేషనల్ మ్యూజిక్ దర్శకుల్లో తన మ్యూజిక్ తో ఓ రేంజ్ హై ని ఇచ్చే సంగీత దర్శకుడు రవి బసృర్ కూడా ఒకరు. కేజీయఫ్, సలార్ లాంటి సినిమాలకి మైండ్ బ్లాకింగ్ మ్యూజిక్ ని ఇచ్చి అదరగొట్టిన రవి బసృర్ సంగీతం అంటే ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇలా ప్రస్తుతం తాను పలు భారీ చిత్రాలకి వర్క్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా మన టాలీవుడ్ సచిత్ర రచయిత సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఓ పిక్ షేర్ చేసుకొని ఓ భారీ సినిమాకి ప్రస్తుతం మ్యూజిక్ సెషన్స్ లో వర్క్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఆ సినిమానే యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “స్వయంభు” కి అట. భగవాన్ హనుమంతుని ఆశీస్సులతో ఈ సినిమా మ్యూజిక్ సెషన్స్ చేస్తున్నట్టుగా ఓ పిక్ షేర్ చేసుకొని శాస్త్రి గారు తెలిపారు. మరి ఈ భారీ ప్రాజెక్ట్ మ్యూజిక్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

Exit mobile version