ఇంటర్వ్యూ: రమణ గోగుల – ‘గోదారి గట్టు’ సాంగ్ రెస్పాన్స్ ఆనందాన్ని ఇచ్చింది!

ఇంటర్వ్యూ: రమణ గోగుల – ‘గోదారి గట్టు’ సాంగ్ రెస్పాన్స్ ఆనందాన్ని ఇచ్చింది!

Published on Dec 17, 2024 9:00 PM IST

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘గోదారి గట్టు’ సాంగ్ 27 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. రమణ గోగుల పాడిన ఈ పాట సోషల్ మీడియాతో పాటు అన్నీ మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా సింగర్ రమణ గోగుల విలేకరుల సమవేశంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ విశేషాల్ని పంచుకున్నారు.

గోదారి గట్టు ఆల్రెడీ 27 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది?

చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉంది. నా పాటని అభిమానించే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మళ్లీ నేనెప్పుడు పాడుతానా అని ఎదురు చూశారు. నేను నా వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయాను. యూఎస్‌లో ఉన్నాను. నేను ఎవరి సంగీతంలో ఇప్పటివరకు పాడలేదు. కానీ అనిల్, బీమ్స్ చాలా లవింగ్ పర్సన్స్. ఫెంటాస్టిక్ యాటిట్యూడ్‌తో ఉంటారు. వెంకటేష్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్. నా తొలి సినిమా వెంకటేష్ గారి ప్రేమంటే ఇదేరా. ఇలాంటి మంచి కాంబినేషన్లో వస్తున్న ఈ పాటని పాడాలని అనుకున్నాను. బీమ్స్ లవ్లీగా కంపోజ్ చేశారు. పాటకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందం ఇచ్చింది. లైఫ్ ఫుల్ సర్కిల్ అయిందనే ఫీలింగ్ వచ్చింది.

ఈ పాట మీ వద్దకు ఎలా వచ్చింది?

నేను యూస్ లో ఉన్నాను. బీమ్స్ కాల్ చేసి తప్పకుండా ఈ సినిమాలో పాట పాడాలని కోరారు. సాంగ్ పంపించమని అడిగాను. పాట ఒక రెండు సార్లు విన్నాను. చాలా నచ్చింది. పాటలో ఒక హార్ట్ ఉంది. డెఫినెట్ గా పాడాలి అనిపించింది. అలా ఈ పాట పాడాను. ఈ పాట పాడటానికి చాలా క్రియేటివ్ ఫ్రీడం దొరికింది.

వెంకటేష్ గారి రెస్పాన్స్ ఎలా ఉంది?

వెంకటేష్ గారు కాల్ చేశారు. నేను మళ్లీ పాట పాడడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఆయనకి పాట చాలా నచ్చింది. ఆయనలో అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు లేదు. అదే మ్యాజిక్ ఉంది. ఆయన రాక్ స్టార్.

మళ్లీ మీరు ఎప్పుడు కంపోజ్ చేయబోతున్నారు?

నేను సిద్ధంగా ఉన్నాను. అయితే అన్నీ కుదరాలి. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చాలా అద్భుతంగా సంగీతం చేస్తున్నారు. పాటలు ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. అయినా ఒక న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కడో చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా దగ్గర కొన్ని వినూత్నమైన ఐడియాలు ఉన్నాయి. యాక్టర్, స్టొరీ, డైరెక్టర్ సరైన సమయంలో పర్ఫెక్ట్ గా కుదరాలి. తప్పకుండా నా నుంచి మ్యూజిక్ ని ఆడియన్స్ ఆశించవచ్చు.

అప్పటికి ఇప్పటికీ మ్యూజిక్ టెక్నాలజీ లో ఎలాంటి మార్పులు వచ్చాయి?

చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా అసలు ఒక సింగర్ పాట పాడాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్ గా సాంగ్ వస్తుంది. అయితే ఒక పాటకి హార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అది హ్యూమన్ టచ్ తోనే సాధ్యమవుతుంది.

పవన్ కళ్యాణ్ గారితో మీది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కదా.. ఆయనతో వర్కింగ్ ఎలా ఉండేది?

పవన్ కళ్యాణ్ గారు క్రియేటివ్ పర్సన్. చాలా కొత్తగా ప్రయత్నిస్తారు. ఫస్ట్ టైం తెలుగు సినిమాల్లో ఇంగ్లీష్ పాట ఆయన సినిమా కోసమే కంపోజ్ చేయడం జరిగింది. ఆయన విన్న వెంటనే ఈ పాట చేస్తున్నామని కాన్ఫిడెంట్ గా చెప్పారు. అది ఒక మ్యాజిక్ లో జరిగింది. ఇప్పుడు ఆయన చాలా గొప్ప స్థాయిలో ఉండటం చాలా ఆనందంగా ఉంది.

మీరు పాడిన పాటల్లో మీకు ఇష్టమైన సాంగ్?

నాకు ఇష్టం లేకపోతే కంపోజ్ చేయను. నాకు అన్ని ఇష్టమే. ఒక్కటి చెప్పాలంటే యువరాజు సినిమాలో ‘మనసేమో చెప్పిన మాటే వినదు’ పాట నాకు చాలా ఇష్టం. అది గ్రేట్ కాంపోజిషన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు