‘రామరాజు ఫర్ భీమ్’కి ఇక ఐదు రోజులే !

Published on Oct 17, 2020 7:20 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా మరో ఐదు రోజుల్లో ‘రామరాజు ఫర్ భీమ్’ రాబోతుందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. మొత్తానికి తారక్ పాత్ర మీద జక్కన్న ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా ఈ వీడియో కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రేమ కోసం ఒలివియా తమ దేశం పైన, తన తల్లిదండ్రుల పైనే పోరాడుతుందట. చివరికీ ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం ప్రాణాలు ఇస్తుందని.. ఎన్టీఆర్ – ఒలివియా ట్రాక్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

More