హీరోయిన్ రజీషా విజయన్ : రామారావు ఆన్ డ్యూటీ ఆడియన్స్ ని అలరించడంతో పాటు ఆలోచింపచేస్తుంది

Published on Jul 23, 2022 3:00 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా రజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. యాక్షన్ మాస్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి శరత్ మండవ దర్శకత్వం వహించగా సుధాకర్ చెరుకూరి, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ఎంతో ఆకట్టుకుని అంచనాలు మరింతగాపెంచాయి . రామారావు ఆన్ డ్యూటీ ఈనెల 29న రిలీజ్ కానున్న సందర్భంగా నేడు మీడియాతో ప్రత్యేకంగా మూవీ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నారు హీరోయిన్ రజీషా విజయన్.

 

ఈ ప్రాజక్ట్ కి మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు . ?

నేను తమిళ్ లో ధనుష్ తో చేసిన కర్ణన్ మూవీ చూసి నాకు దర్శకుడు శరత్ మండవ కాల్ చేసారు. అనంతరం నన్ను కలిసి సినిమా గురించి వివరించారు. ఏదైనా ఒక భాషలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలి అంటే బలమైన కథ ఉంటెప్రేక్షకులు, అభిమానులకు బాగా చేరువ అవ్వచ్చు అనే నా ఆలోచనకి పక్కాగా మ్యాచ్ అయింది ఈ మూవీలోని నా పాత్ర. ఎంతో అద్భుతమైన కథ ఇది. ఈ మూవీలో నా పాత్ర పేరు మాలిని, అందంతో పాటు అభినయానికి కూడా బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది.

 

రవితేజ గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది ?

నాకు రవితేజ గారితో ప్రత్యేకంగా పరిచయం లేనప్పటికీ నార్త్ లో పుట్టిన పెరిగిన నేను గతంలో ఎన్నో రవితేజ గారి మూవీస్ డబ్బింగ్ వర్షన్ లో చూసాను. ఇప్పుడు అయితే పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు కానీ, అప్పట్లోనే ఆయన మూవీస్ కి ఎంతో మంచి క్రేజ్ ఉండేది. నాకు తెలిసిన స్నేహితులు కొందరికి రవితేజ గారు తెలుసు. అలానే ఈ మూవీలో ఆయన ప్రక్కన ఛాన్స్ దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన మాస్ హీరో, సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా అందరితో ఎంతో కలిసిపోయి సరదాగా వ్యవహరిస్తూ ఉంటారు. అలానే సెట్స్ లో ఆయన ఎనర్జీ లెవెల్స్ కూడా సూపర్, అందరికీ మంచి జోష్ వస్తుంది ఆయనని చూస్తే. ఓవరాల్ గా ఈ పాత్ర ద్వారా ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది.

 

డైరెక్టర్ శరత్ గారితో వర్కింగ్ గురించి చెప్పండి ?

డైరెక్టర్ శరత్ గారు ఎంతో మంచి క్లారిటీ కలిగిన వ్యక్తి. ఈ కథ ఎంత బలమైనదో, అంతే విధంగా ఇందులో యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, డ్యాన్స్ వంటి అన్ని అంశాలు మిళితమై ఉన్నాయి. ఇక తను కథ చెప్పినప్పుడే ప్రతి ఒక్క అంశం ఎంతో వివరంగా క్లారిటీ తో చెప్పారు. అన్ని కలగలిసిన ఇంత మంచి సబ్జెక్టుని డీల్ చేయడం అంటే ఈజీ కాదు, అటువంటిది డైరెక్టర్ శరత్ ప్రతి విషయంలో ఎంతో బాగా శ్రద్ధ తీసుకుని మూవీని తెరకెక్కించారు. ఆయన ఎంతో క్లారిటీ తో మూవీ తీశారు, రేపు తెరపై తప్పకుండా ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు.

 

మూవీలో మీ క్యారెక్టర్ కి డబ్బింగ్ మీరే చెప్పారా ?

నిజానికి తెలుగులో వచ్చిన నా తెలుగు సినిమాలని ఇక్కడి వారు ఎంతో అభిమానించి ప్రేమించారు. అలానే తొలిసారిగా ఈ మూవీ ద్వారా తెలుగులో పరిచయం అవ్వడం ఆనందంగా ఉంది. నిజానికి నాకు తెలుగు సరిగ్గా రాదు, ఇప్పుడిప్పుడే మెల్లగా నేర్చుకుంటున్నాను, తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని ఛాన్స్ లు వస్తే నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకునే ప్రయత్నం చేస్తాను.

 

మీరు ఇప్పటివరకు తమిళ్, మలయాళ మూవీ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసారు కదా, తెలుగుతో కంపేర్ చేస్తే అవి ఎలా ఉన్నాయి ?

నిజానికి సినిమా అనేది ఏ భాష అయినా ఒక్కటే. అందరూ ఒకటే విధంగా తీస్తారు కదా. అయితే తమిళ్, మలయాళం లతో పోలిస్తే తెలుగులో బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలానే ఇక్కడి ఆడియన్స్ సినిమాలని ఎంతో ప్రేమిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎక్కువ ఉండడంతో పటు సినిమాలు చూసే వారు కూడా ఎక్కువ. అదే మెయిన్ డిఫరెన్స్ మిగతావి అన్ని ఇండస్ట్రీస్ లో ఒక్కటే.

 

మలయాళం నుండి చాలా సినిమాలు రీమేక్ అవుతుంటాయి కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి ?

నిజానికి మలయాళ మూవీస్ లో చాలావరకు స్టార్స్, డైరెక్టర్స్, టెక్నీషియల్స్, ప్రొడ్యూసర్స్ వీరందరికంటే కూడా మూవీకి స్క్రిప్ట్ అనేది బలమైన అంశం. దాదాపుగా అక్కడ సినిమాలు అన్ని కూడా ముందే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం అయితేనే ప్రారంభిస్తారు. అలానే కథ, కథనాల్లో పక్కాగా బలం ఉండేలా రచయితలు రాసుకుంటారు. బహుశా అదే పెద్ద రీజన్ కావొచ్చు అనుకుంట.

 

ఒటిటి ల ప్రభావం థియేటర్స్ పై ఉంటుందని మీరు నమ్ముతారా ?

ఓవరాల్ గా చెప్పాలి అంటే సినిమా అనేది మెయిన్ గా థియేటర్ ఎక్స్ పీరియన్స్ లో అల్టిమేట్ గా ఉంటుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గారు సినిమాలో సీన్స్ చేసిన తరువాత అవి మానిటర్ లో చూడరు, ఎందుకు చూడలేదు అని అడిగితే, నేను చేసేది బిగ్ స్క్రీన్ ఆడియన్స్ చూడడానికి వారు ఎలా ఫీల అవుతారు అనే ఆలోచనతో చేస్తాను అంటారు. ఆ విధంగా థియేటర్ లో మూవీ చూస్తే కిక్ వారు. త్వరలో రానున్న మా రామారావు ఆన్ డ్యూటీ మూవీ కూడా అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడండి. తప్పకుండా మీ అందరికీ మూవీ నచ్చుతుంది.

 

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?

మాలయంకుంజు తో పాటు మరొక నాలుగు మలయాళ మూవీస్ రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి, వాటితో పాటు త్వరలో మరొక రెండు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.

మీ రామారావు ఆన్ డ్యూటీ మూవీ సూపర్ హిట్ కొట్టి మీకు తెలుగులో మంచి శుభారంభం ఇవ్వాలి, ఆల్ ది బెస్ట్, థాంక్యూ

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :