మాస్ మహారాజా రవితేజ హీరోగా రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. సామ్ సి మ్యూజిక్ అందించిన ఈ మూవీని సుధాకర్ చెరుకూరి, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ ఫై నిర్మించారు. రవితేజ ఎమ్మార్వోగా కనిపించనున్న ఈ మూవీలో వేణు తొట్టెంపూడి ఒక కీలక రోల్ చేస్తుండగా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఇటీవల సాంగ్స్, ట్రైలర్ విడుదల తరువాత మరింతగా ఆ అంచనాలు పెంచేసింది. ఈనెల 29న విడుదల కానున్న ఈ మూవీ నుండి రేపు ఉదయం 11 గం. 7 ని. లకు రామారావు మాస్ నోటీస్ పేరుతో గ్లింప్స్ వీడియో ని రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ గ్లింప్స్ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని, అలానే మూవీ కూడా అద్భుత విజయం అందుకోవడం ఖాయం అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తోంది యూనిట్.
A glimpse of RamaRao's MASS before the explosion in Theatres on July 29th ❤️????#RamaRaoOnDuty Mass Notice Tomorrow at 11:07 AM????????
Mass Maharaja @RaviTeja_offl @directorsarat @Divyanshaaaaaa @rajisha_vijayan @SamCSmusic @sathyaDP @Cinemainmygenes @RTTeamWorks @LahariMusic pic.twitter.com/2erUeSsM0W
— SLV Cinemas (@SLVCinemasOffl) July 26, 2022