రవితేజ సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్ ?

రవితేజ సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్ ?

Published on Feb 25, 2020 10:16 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల స‌మాచారం ప్రకారం ఈ సినిమాకి ‘కిలాడీ’ అనే టైటిల్ ను పెట్టాలనుకునట్లు తెలుస్తోంది. ఏ స్టూడియోస్ పతాకం పై హవీష్ ప్రొడక్షన్లో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నారు.

కాగా మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు దర్సకనిర్మాతలు. ఇక ‘రాక్షకుడు’ వంటి బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై ప్రేక్షకులకు బాగానే ఆసక్తి నెలకొంది. ప్ర‌స్తుతం రవితేజ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో క్రాక్‌ సినిమాలో న‌టిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు