రామ్ ‘రెడ్’ ఓపెనింగ్స్ అదుర్స్

Published on Jan 16, 2021 2:07 am IST

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఫామ్లోకి వచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త చిత్రం ‘రెడ్’. సంక్రాతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి స్పందన అనుకుంటోంది. మొదటిరోజు ఊహించిన దానికంటే ఎక్కువగానే వసూలు చేసింది. మార్కింగ్ షో నుండే ఫుల్ ఆక్యుపెన్సీని అందుకున్న ఈ చిత్రం సెకండ్ షో వరకు అదే జోరును కొనసాగించింది. దీంతో మంచి షేర్ దక్కించుకుంది.

ప్రాంతాల వారీగా వసూళ్లను చూస్తే నైజాంలో 2.19 కోట్లు, సీడెడ్లో 1.17 కోట్లు, ఉత్తరాంధ్రలో 53 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 63.85 లక్షలు, వెస్ట్ గోదావరిలో 97.5 లక్షలు, గుంటూరులో 46.5 లక్షలు, కృష్ణాలో 35. 3 లక్షలు, నెల్లూరులో 36 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఫస్ట్ డే 6.7 కోట్ల షేర్ రాబట్టుకుంది. ఇక ఈరోజు సెలవు కావడంతో వసూళ్లు స్టడీగానే కొనసాగుతున్నాయి. మొత్తానికి రామ్ ఈ సంక్రాంతికి మంచి ఫలితాన్నే అందుకున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :