ఇంటర్వ్యూ : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’లో అందరినీ నవ్విస్తా – రమ్య పసుపులేటి

ఇంటర్వ్యూ : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’లో అందరినీ నవ్విస్తా – రమ్య పసుపులేటి

Published on Aug 19, 2024 6:43 PM IST

ప్రముఖ నటుడు రావు రమేష్ మెయిన్ లీడ్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాలో నటి ఇంద్రజ రావు రమేష్‌కి జంటగా నటించింది. ఈ సినిమాను లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేయగా అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఈ శుక్రవారం సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రమ్య పసుపులేటి మీడియాతో మాట్లాడారు.

రమ్య గారు… మీ గురించి చెప్పండి!

నేను చిన్నతనం నుంచే యాడ్స్ చేస్తున్నాను. అనుష్క గారి ‘పంచాక్షరీ’లో బాలనటిగా చేశా. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ‘స్పైడర్’లోనూ ఓ రోల్ చేశా. ఆ తర్వాత చదువుకోవాలని గ్యాప్ తీసుకున్నాను. బ్యాచిలర్స్ ఫినిష్ చేసి సినిమాల్లోకి వచ్చాను. ప్రజలకు రీచ్ అవ్వడానికి ఇన్‌స్టాగ్రామ్‌ హెల్ప్ అయ్యింది.

‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’లో మీకు అవకాశం ఎలా వచ్చింది?

దర్శకుడు లక్ష్మణ్ కార్య గారు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశారట. ఈ అమ్మాయిని పిలవండి, ఆడిషన్ చేద్దామని టీమ్ మెంబర్లతో చెప్పారట. ఆఫీసుకు వెళ్లాక ఆడిషన్ చేశారు. నా పెర్ఫార్మన్స్ నచ్చడంతో ఎంపిక చేశారు. మంచి అవకాశం రావడంతో హ్యాపీగా ఫీలయ్యాను.

కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి?

నవ్వించడం కష్టం. ప్రేక్షకుల్ని నవ్వించగలిగితే క్యారెక్టర్ పండినట్టు. ఇందులో నా పాత్ర ద్వారా నవ్వించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన వాళ్లందరికీ నా రోల్ నచ్చుతుంది.

మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

బబ్లీ, క్యూట్ అండ్ ఇన్నోసెంట్ అమ్మాయి. కొంచెం తింగరితనం ఉంటుంది కానీ, చాలా నవ్విస్తా. నాకు కామెడీ చేయడం చాలా ఇష్టం. ఎమోషన్స్ కూడా బాగా చేస్తా.

అంకిత్ కొయ్యతో మీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్?

వెరీ అమేజింగ్ కో యాక్టర్. వ్యక్తిగతంగా మనిషికి హెల్ప్ చేసే పర్సనాలిటీ. నటుడిగా ఎలా చేస్తాడో ‘ఆయ్’లో చూశాం. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా బావుంటాయి.

రావు రమేష్, ఇంద్రజ వంటి సీనియర్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది?

మొదట భయం వేసింది. నేను కంఫర్టబుల్‌గా ఉండేలా వాళ్ళు చూసుకున్నారు. ఓ రోజు సీన్ అయ్యాక రావు రమేష్ గారు ‘బాగా చేశావమ్మా’ అన్నారు. ఆ తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంద్రజ గారు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదు. ఆవిడ చాలా ప్రెట్టిగా ఉంటారు. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు