మానాడు తెలుగు రీమేక్‌లో రానా!

మానాడు తెలుగు రీమేక్‌లో రానా!

Published on Jul 19, 2022 3:06 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటించిన మానాడు తమిళనాడులో సంచలన విజయం సాధించింది. తెలుగులో దీని అధికారిక రీమేక్ గురించి ఆన్‌లైన్‌లో చాలా పుకార్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ రీమేక్‌ వార్త హల్‌చల్‌ చేసింది. తన రాబోయే విడుదల థాంక్యూ కోసం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, నాగ చైతన్య మానాడు తెలుగు రీమేక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

కోలీవుడ్ హిట్ మూవీని రానా దగ్గుబాటి రీమేక్ చేస్తున్నట్లు అక్కినేని నాగ చైతన్య తెలిపారు. అయితే, ఈ రీమేక్ గురించి ఎలాంటి ఇతర సమాచారాన్ని వెల్లడించలేదు. శింబు పాత్రలో రానా నటిస్తున్నాడని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు