లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. దీనికి చాలా సినిమాలు ఉదాహరణగా నిలిచాయి. ఇక ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అందాల భామ వేదిక నటిస్తున్న ‘ఫియర్’ అనే సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.
యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను డా.హరిత గోగినేని డైరెక్ట్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్‌లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్‌ను తెలుగులో టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 12.12 గంటలకు రానా చేతుల మీదుగా ఫియర్ చిత్ర టీజర్ లాంచ్ కానుంది.
ఈ సినిమాలో పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఏఆర్ అభి ప్రొడ్యూస్ చేస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.