నాని కోసం విల‌న్ గా మారుతున్న రానా..?

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం ‘స‌రిపోదా శ‌నివారం’ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి యాక్ష‌న్ ఎంటర్టైన‌ర్ గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. కాగా, ఈ సినిమా త‌రువాత నాని త‌న నెక్ట్స్ ప్రాజెక్టుల‌ను ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

ఇప్ప‌టికే శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ ఫ్రాంచైజీ మూవీ ‘హిట్-3’ని లైన్ లో పెట్టిన నాని, ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల డైరెక్ష‌న్ లో ఓ సినిమా చేయ‌నున్నాడు. దీంతో పాటు శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్ లోనూ ఓ సినిమాను చేయ‌నున్నాడు. అయితే, హిట్ 3 సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సినీ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

హిట్-3 మూవీలో విల‌న్ పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి న‌టించ‌బోతున్నాడ‌ట‌. నాని, రానాల మ‌ధ్య మంచి స్నేహం ఉంది. దీంతో నాని సినిమాలో విలన్ పాత్ర‌లో న‌టించేందుకు రానా ఓకే చెప్పిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఈ వార్త‌ల‌కు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Exit mobile version