చిరుకు కూడ రానాయే కావాలట ?

Published on Oct 27, 2020 11:07 pm IST


మెగాస్టార్ చిరంజీవి సైన్ చేసిన చిత్రాల్లో ‘లూసిఫెర్’ తెలుగు రీమేక్ కూడ ఒకటి. మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. అందులో హీరో పాత్ర, స్టైలిష్ మేకింగ్ నచ్చి చిరంజీవి సినిమా చేయాలసిందే అనుకున్నారు. పలు మార్పుల తరవాత చివరకు వినాయక్ చేతికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఒరిజినల్ కథ, కథనాలను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మలచే పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమాలోని ద్వితీయార్థంలో ఒక ముఖ్యమైన రోల్ ఉంటుంది. మలయాళంలో ఆ పాత్రను పృథ్వీరాజ్ మనోహారన్ చేయడం జరిగింది. ఈ పాత్ర కోసం తెలుగులో పెద్ద నటుడిని తీసుకోవాలని భావించిన టీమ్ మ్యాచో మాన్ రానా అయితే బాగుంటుందని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతానికి ఈ సజెషన్ పరిశీలనలో మాత్రమే ఉంది. అన్ని పనులు ముగిసి సినిమా మొదలయ్యేనాటికి రానాయే సినిమాలోకి వస్తారా లేకపోతే వేరో ఎవరినైనా తీసుకొస్తారా అనేది చూడాలి. మరోవైపు పవన్ చేయనున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్లో కూడ రానా ఒక ప్రధాన పాత్ర చేస్తునట్టు వార్తలొస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More