కంబైన్డ్ స్టడీస్ రామ్ చరణ్ తో చేసేవాడ్ని – రానా దగ్గుబాటి


నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 35 – చిన్న కథ కాదు సెప్టెంబర్ 6 న థియేటర్లలోకి రానుంది. డైరెక్టర్ నందకిషోర్ ఈమని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రానా, పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

రామ్ చరణ్ తో కంబైన్డ్ స్టడీస్ చేసేవాడిని అని తెలిపిన రానా, కిటికీల గ్రిల్ తీసేసి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళం అని అన్నాడు. ఈ ఈవెంట్ అంతా సరదాగా సాగగా, రాజమౌళి అన్ని సబ్జెక్టులు నేర్పించే మాస్టారు అని, తారక్ కంటే బెస్ట్ టీచర్ మరొకరు ఉండరు అని తెలిపాడు. రానా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version