అరణ్య కోసం రానా అంత పెద్ద సాహసం చేశాడట.

అరణ్య కోసం రానా అంత పెద్ద సాహసం చేశాడట.

Published on Feb 25, 2020 3:18 PM IST

దగ్గుబాటి రానా ప్రస్తుతం ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. హాథీ మేరే సాథీ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రం అరణ్య పేరుతో విడుదల అవుతుంది. కాగా ఈ చిత్రంలో రానా బాన్ దేవ్ అనే అడవి తెగకు చెందిన వ్యక్తి పాత్ర చేస్తున్నాడు. ఈ పాత్ర కోసం రానా దాదాపు 30కేజీల బరువు తగ్గాడట. ఈ విషయాన్ని రానా స్వయంగా చెప్పుకొచ్చారు.

”డైరెక్టర్ ప్రభు సాల్మన్ నా పాత్రకు సంబంధించి ప్రతిదీ వాస్తవికంగా, సహజంగా ఉండాలని భావించారు. ఎప్పుడూ భారీకాయంతో, దృఢంగా ఉండాలనుకొనే నాకు ఈ స్థాయిలో బరువుతగ్గడం అనేది చాలా క్లిష్టమైన పని. బాణదేవ్ క్యారెక్టర్ కోసం సన్నగా మారడానికి తీవ్రమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నా. అది నాకొక వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్ పీరియెన్స్” అని ఆయన తెలిపారు. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా 2020 ఏప్రిల్ 2 విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు