సాయి పల్లవి “గార్గి” ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న రానా, నాని!

Published on Jul 7, 2022 12:31 pm IST


లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన గార్గిలో కనిపించనుంది. ఈ చిత్రం జూలై 15, 2022 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి మరియు నేచురల్ స్టార్ నాని ఈరోజు సాయంత్రం 06:06 గంటలకు గార్గి తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యలక్ష్మి, థామస్ జార్జ్, గౌతం రామచంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 96 ఫేమ్ గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతం అందించారు, తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నది.

సంబంధిత సమాచారం :