తన గుండెను తీసి తన చేతుల్లో పెట్టినట్టుందట

తన గుండెను తీసి తన చేతుల్లో పెట్టినట్టుందట

Published on Jul 29, 2024 1:32 PM IST

బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ తన కుమార్తె రాహా పుట్టాక తన జీవితం పూర్తిగా మారిపోయిందంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ.. ‘రాహా పుట్టినప్పుడు నేను అనుభవించిన ఆనందం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ సంతోషం నాకింకా గుర్తుంది. నా కూతురు పుట్టకముందు నేను ఒకలా ఉన్నాను. కానీ ఇప్పుడు నాలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం కొత్త భావోద్వేగాలను, కొత్త ఆలోచనలను అనుభవిస్తున్నాను’ అంటూ రణ్‌బీర్‌ కపూర్‌ చెప్పారు.

రణ్‌బీర్‌ కపూర్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘ఓ విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. రాహా జన్మించక ముందు వరకు నాకు మరణం గురించి, ఆరోగ్యం గురించి అసలు భయం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. గతంలో సిగరెట్‌ తాగేవాడిని. తండ్రి అయ్యాక వెంటనే మానేశాను. రాహాను నా చేతుల్లోకి తీసుకున్న క్షణం… నా గుండెను తీసుకొచ్చి నా చేతిలోనే పెట్టిన ఫీలింగ్ కలిగింది’ అంటూ రణ్‌బీర్‌ కపూర్‌ ఎమోషనల్ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు