200 కోట్ల క్లబ్ లోకి రణబీర్ కపూర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

200 కోట్ల క్లబ్ లోకి రణబీర్ కపూర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

Published on Mar 29, 2023 5:00 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇటీవల తూ ఝూటి మెయిన్ మక్కర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించడంలో విజయవంతమైంది. రణబీర్ కపూర్ మరియు శ్రద్ధా కపూర్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నారు. రెండు 100 కోట్ల నెట్ సినిమాలు సాధించిన ఏకైక హిందీ హీరోగా రణబీర్ అరుదైన రికార్డు సృష్టించాడు.

ఇప్పుడు తూ ఝూటి మెయిన్ మక్కర్ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్‌ను అధిగమించింది. ఇందులో ఇండియా నుంచి 161 కోట్లు రాగా, ఓవర్సీస్ కలెక్షన్లు 40 కోట్ల రూపాయలు. లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుభవ్ సింగ్ బస్సీ, బోనీ కపూర్, డింపుల్ కపాడియా, మోనికా చౌదరి మరియు హస్లీన్ కౌర్ కీలక పాత్రలు పోషించారు. లవ్ ఫిల్మ్స్ మరియు టి సిరీస్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని వైఆర్ఎఫ్ ఫిల్మ్స్ పంపిణీ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు