డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “రంగ రంగ వైభవంగా”

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ మరియు కేతిక శర్మ హీరో హీరోయిన్ లుగా నటించిన రంగ రంగ వైభవంగా సెప్టెంబర్ 2, 2022 న థియేటర్లలో విడుదలైంది. గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్ళను సాధించలేదు.

లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఈ చిత్రం అక్టోబర్ 2, 2022 న నెట్‌ఫ్లిక్స్‌ లో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. థియేటర్లలో సినిమా ను మిస్ అయిన వారు వచ్చే నెల నుండి నెట్‌ఫ్లిక్స్‌ లో చూడవచ్చు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌ పై తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, సుబ్బరాజు, నరేష్, ప్రభు తదితరులు కీలక పాత్రల్లో నటించడం జరిగింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version