నాగ శౌర్య ను మరోసారి డైరెక్ట్ చేయనున్న పవన్ బసంశెట్టి?

నాగ శౌర్య ను మరోసారి డైరెక్ట్ చేయనున్న పవన్ బసంశెట్టి?

Published on Jun 19, 2024 12:30 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పవన్ బసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రంగబలి. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో మురళి శర్మ, సత్య, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందించారు.

ఇప్పడు ఈ కాంబినేషన్ లో మరో చిత్రం రానున్నట్లు సమాచారం. ఈ సారి నాగ శౌర్య కి సూపర్ హిట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ పవన్ బసంశెట్టి. రంగబలి చిత్రం ను నిర్మించిన SLV సినిమాస్ ఈ చిత్రం ను కూడా నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం పై త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు