విడుదల తేదీ : జూలై 07, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..
దర్శకుడు : పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీతం: పవన్ సిహెచ్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్
సంబంధిత లింక్స్: ట్రైలర్
హీరో నాగ శౌర్య హీరోగా, పవన్ బాసంశెట్టి రచన, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగ బలి. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ :
శౌర్య అలియాస్ షో (శౌర్య) తన సొంతూరు రాజవరంలో కింగ్ లా బతకాలని ఆశ పడతాడు. మరోవైపు శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) మెడికల్ షాప్ ను నడిపిస్తూ ఊర్లో గౌరవంగా బతుకుతుంటాడు. కానీ, కొడుకు భవిష్యత్తు పై ఆందోళనతో ఉంటాడు. ఈ క్రమంలో శౌర్యను వైజాగ్ లో మెడికల్ కాలేజ్ కి పంపిస్తాడు. అక్కడి మెడికల్ కాలేజ్‌లో సహజ (యుక్తి)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య శౌర్య ప్రేమకు అతని ఊరిలోని రంగబలి సెంటర్ అడ్డంకిగా మారుతుంది ?, ఇంతకీ ఆ సెంటర్‌కు రంగబలి అని పేరు ఎందుకు వచ్చింది ?, అలాగే రంగబలి సెంటర్‌కు ఆ ఊరి ఎమ్మెల్యే పరుశురామ్ (షైన్ టామ్ చాకో)కు ఉన్న రిలేషన్ ఏంటి ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
రంగ బలి సినిమాలో సత్య కామెడీ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సత్య తన టైమింగ్ తో చాలా బాగా అలరించారు. హీరోగా కూడా నటించిన నాగ శౌర్య తన టైమింగ్ తో అండ్ తన యాక్షన్ తో బాగా నటించాడు. సినిమాలోని కోర్ ఎమోషన్ని నాగ శౌర్య కొన్నిచోట్ల తన హావభావాలతోనే బాగా పలికించాడు. అలాగే హీరోయిన్ యుక్తి తరేజా కూడా చాలా బాగా నటించింది. తన గ్లామర్ తోనూ ఆమె ఆకట్టుకుంది.
విలన్ గా షైన్ టామ్ చాకో బాగా నటించారు. కాకపోతే ఆయన పాత్రను ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది. శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు.. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో గోపరాజు రమణ అద్భుతంగా నటించారు. ఆయన కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ :
పవన్ బాసంశెట్టి తీసుకున్న కథాంశం, సత్య – గోపరాజు రమణ పాత్రలు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో సిల్లీగా సాగుతుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే ఉంటాయి.
దీనికితోడు దర్శకుడు రాజవరం ఊరు చుట్టే రిపీటెడ్ సన్నివేశాలు పెట్టి సినిమాని నడిపాడు. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ను ఇంకా బెటర్ గా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.
అలాగే, ప్రీ క్లైమాక్స్ ను, క్లైమాక్స్ ను ఇంకా బాగా డిజైన్ చేసుకోవాల్సింది. హీరో పాత్ర తీరులోనూ బలం లేదు. ఓవరాల్ గా ఈ సినిమాలో కథాకథనాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. పవన్ బాసంశెట్టి రచయితగా విఫలం అయ్యాడు. స్క్రీన్ ప్లే పరంగా అతను అసలు ఆకట్టుకోలేదు. సంగీత దర్శకుడు పవన్ సిహెచ్ అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదు. ఇక ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాత సుధాకర్ చెరుకూరి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
రంగ బలి అంటూ వచ్చిన ఈ లోకల్ యాక్షన్ డ్రామాలో మెయిన్ పాయింట్, కొన్ని కామెడీ సన్నివేశాలు అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. అయితే, కథాకథనాలు ఇంట్రెస్ట్ గా సాగకపోవడం, కొన్ని చోట్ల ప్లే స్లోగా, రొటీన్ గా సాగడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team