‘రంగస్థలం’ కాంబినేషన్ సస్పెన్స్..!

‘రంగస్థలం’ కాంబినేషన్ సస్పెన్స్..!

Published on Mar 30, 2025 3:10 PM IST

మన తెలుగు సినిమా దగ్గర గుర్తుండిపోయే కొన్ని ఐకానిక్ సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు సుకుమార్ ల కలయికలో వచ్చిన రూరల్ సెన్సేషనల్ హిట్ చిత్రం “రంగస్థలం” తప్పక ఉంటుంది. మరి ఈ చిత్రం విడుదల అయ్యి నేటికి ఏడేళ్లు పూర్తి కావడంతో మరొక్కసారి అభిమానులు ఈ సినిమా స్మృతులు మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఇలాంటి సినిమా అందించిన కాంబినేషన్ నుంచి మరో చిత్రం అనౌన్స్ అయ్యిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో 18వ సినిమాగా దర్శకుడు సుకుమార్ తో మరోసారి అనౌన్స్ అయ్యిన ఈ సినిమాపై అనేక అంచనాలు నెలకొన్నాయి. కానీ లేటెస్ట్ గా మాత్రం వీరి కలయికలో సినిమా తాత్కాలికంగా వాయిదా పడినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

మొన్న చరణ్ బర్త్ డే కూడా ఈ కాంబినేషన్ పై ఎలాంటి అప్డేట్ రాకపోవడం గమనార్హం కాగా. ఈ సినిమా ప్రస్తుతానికి జరిగే సూచనలు కనిపించడం లేదు అని తెలుస్తుంది. అయితే చరణ్ 17వ సినిమాగా మరో దర్శకునితో ఉండొచ్చట. ఈ తర్వాత చరణ్ 18వ సినిమాగా సుకుమార్ కలయికలో ఉంటుంది అని టాక్. మరి దీనితో రంగస్థలం కాంబినేషన్ పై మంచి సస్పెన్స్ ఇపుడు నెలకొంది. ఇక మేకర్స్ నుంచి దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు