సమీక్ష : రంగు – అక్కడక్కడ పర్వాలేదనిపించే క్రైమ్ డ్రామా !

సమీక్ష : రంగు – అక్కడక్కడ పర్వాలేదనిపించే క్రైమ్ డ్రామా !

Published on Nov 24, 2018 3:55 AM IST
Rangu movie review

విడుదల తేదీ : నవంబర్ 23, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : తనీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ష‌ఫీ, టార్జాన్‌, ర‌ఘు కారుమంచి, హ‌రిబాబు, త‌దిత‌రులు

దర్శకత్వం : కార్తికేయ‌.వి

నిర్మాత : ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి, న‌ల్ల అయ‌న్న నాయుడు

సంగీతం : యోగీశ్వ‌ర శ‌ర్మ‌

సినిమాటోగ్రఫర్ : పిటి.సురేంద‌ర్ రెడ్డి

త‌నీశ్‌, ప్రియా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు కార్తికేయ‌.వి తెరకెక్కించిన చిత్రం ‘రంగు’. ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు నిర్మించిన ఈ చిత్రం, ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :
లారా (త‌నీశ్‌) టెన్త్ లో స్కూల్ టాపర్, ఇంటర్ మీడియట్ లో కూడా అతనికి స్టేట్ సెకెండ్ ర్యాంక్ వస్తోంది. అలా బ్రిలియంట్ స్టూడెంట్ గా కాలేజీలోకి అడుగు పెట్టిన లారా ఓ అమ్మాయి కోసం కాలేజీలో సీనియర్ తో గొడవ పడతాడు. సహజంగా ఆవేశపరుడైన లారా ఆ గొడవ కారణంగా దాడులు చేసంత దూరం వెళ్తాడు. ఆ క్రమంలో లారా అనుకోకుండా జరిగిన ఓ సంఘటన కారణంగా ఓ వ్యక్తిని చంపేస్తాడు.

ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల లారా రౌడీ షీటర్ గా మారతాడు. సెటిల్ మెంట్స్ చేస్తాడు. ఈ క్రమంలో పూర్ణ (ప్రియా సింగ్‌) లారాను చూసి ఇష్ట పడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఐతే అప్పటికే లారా పై శత్రువులు దాడి చెయ్యడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంటారు. వారి నుండి ఏసీపీ రాజేంద్రన్ (పరుచూరి రవి) లారాను కాపాడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు ? ఆ ప్రయత్నాల వల్ల లారా వారి నుండి తప్పించుకున్నాడా ? లేడా ? అసలు లారా చివరకి బతుకుతాడా ? లేడా ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ఆవేశపరుడైన లారా పాత్రలో నటించిన త‌నీశ్‌ చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో పాత్రకు తగ్గట్లు కొత్త లుక్ తో కనిపించాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు యాక్షన్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరో హీరోయిన్ల మధ్య సీన్లు, వారి మధ్య కెమిస్ట్రీ బాగానే అలరిస్తుంది.

ఇక కథానాయకిగా నటించిన ప్రియా సింగ్‌ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా హీరోని పోలిసుల నుండి కాపాడే సన్నివేశంలో మరియు తన భర్తకు ఏదైన జరగరానిది జరుగుతుందేమో ఆమె బాధ పడే సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది.

సినిమాలో మరో కీలక పాత్ర అయిన ఏసీపీ రాజేంద్రన్ పాత్రలో నటించిన పరుచూరి రవి తన గాంభీరమైన నటనతో మెప్పించారు.

ఇక పోసాని కృష్ణ మురళి, రఘు, తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల బాగానే నవ్విస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు కార్తికేయ‌.వి విజయవాడలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా మరియు రౌడీ షీటర్ లారా జీవితానికి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు.

హీరో, విలన్లతో గొడవ పడే సన్నివేశాలకు కారణాలు కూడా పెద్దగా బలంగా అనిపించవు. అలాగే వారి మధ్యన వచ్చే గొడవ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. దీనికి తోడు సినిమాలో ఎంటర్ టైన్మెంట్ కూడా పెద్దగా లేదు.

పైగా కథనం స్లోగా సాగడం, లవ్ స్టోరీ పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం, లారా తీసుకున్నే కొన్ని నిర్ణయాలకు సంబంధించిన సన్నివేశాలు సరిగ్గా కన్విన్స్ కాకపోవడం, స్టేట్ ర్యాంకర్ అయిన లారా ఓ రౌడీ షీటర్ గా మారడానికి, బలమైన కారణాలను అంతే బలంగా చూపించపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు కార్తికేయ‌.వి మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. పిటి.సురేంద‌ర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా సహజంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు యోగీశ్వ‌ర శ‌ర్మ‌ అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఎపైడి బ‌స్వ రెడ్డి ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు:

త‌నీశ్‌, ప్రియా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు కార్తికేయ‌.వి తెరకెక్కించిన ఈ చిత్రంలో కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నా… సినిమా పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు. దర్శకుడు కార్తికేయ‌.వి విజయవాడలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా మరియు రౌడీ షీటర్ లారా జీవితానికి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను తగ్గట్లు ఇంట్రస్టింగ్ గా సాగే కథా కథనాలను రాసుకోలేదు. లారా, విలన్లతో గొడవ పడే సన్నివేశాలకు కారణాలు కూడా పెద్దగా బలంగా అనిపించవు.

పైగా లారా తీసుకున్నే కొన్ని నిర్ణయాలకు సంబంధించిన సన్నివేశాలు సరిగ్గా కన్విన్స్ కాకపోవడం, స్టేట్ ర్యాంకర్ అయిన లారా ఓ రౌడీ షీటర్ గా మారడానికి, బలమైన కారణాలను అంతే బలంగా చూపించపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

అయితే సినమాలో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుపోతాయి. తనిశ్ నటన కూడా చాలా బాగుంది. మొత్తం మీద ఈ చిత్రం రౌడీయిజం ప్రభావం ఉన్న ఏరియాలతో పాటు ‘సి’ సెంటర్ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

 

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు