నాగ చైతన్య – సమంత హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఏప్రిల్ 5వ తేదీన వచ్చిన మజిలీ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద గుడ్ రెవిన్యూను రాబడుతుంది. దాంతో చిత్రబృందం ఈ రోజు సక్సెస్ మీట్ ను నిర్వహించింది.
కాగా ఈ సక్సెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో చైతు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు రావు రమేష్ ఎమోషనల్ గా మాట్లాడుతూ.. సమంత , నాగ చైతన్య ల పాత్ర మరిచిపోలేనిది.. మా జీవితంలో గుర్తుండిపోయే సినిమా మజిలీ. సినిమాలో అందరు బాగా నటించారు. సుబ్బరాజ్ గారు పాత్ర వెరైటీ గా ఉంది.. ప్రతి పాత్ర చాల బాగా డిజైన్ చేశారు శివ.. పాటలు అద్భుతంగా ఉన్నాయి.. థమన్ గారి నేపథ్య సంగీతం సినిమా కే హైలైట్. అని అన్నారు.
రావు రమేష్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఫ్యూచర్ లో ఈ సినిమా రాబోయే సినిమాలకు ఒక ఇన్స్పిరేషన్ లా ఉంటుందని ముందే అనుకున్నాను. అది నిజం చేస్తూ ఇంత మంచి హిట్ అందించిన ప్రేక్షకులకు చాల థాంక్స్.’ అని తెలిపారు.